హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్ సర్... శుభాకాంక్షలు తెలిపిన సమంత

  • రేపు పవన్ పుట్టినరోజు
  • ముందుగానే స్పందించిన సామ్
  • గొప్ప విజ్ఞానంతో గొప్ప బాధ్యతలు వస్తాయంటూ ట్వీట్
టాలీవుడ్ సుందరి సమంత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. పవన్ రేపు (సెప్టెంబరు 2) బర్త్ డే జరుపుకుంటున్నారు. పవన్ తో కలిసి అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించిన సమంత... ఈ సందర్భంగా ముందస్తుగా స్పందించింది. నిజంగా అద్భుతమైన వ్యక్తి పవన్ కల్యాణ్ సర్ కు వెరీ హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేసింది. గొప్ప విజ్ఞానంతో గొప్ప బాధ్యతలు వస్తాయి, మీకు ఎప్పటికీ మంచి ఆరోగ్యం, ఘనమైన సంతోషం దక్కాలని ఆశిస్తున్నట్టు తెలిపింది.

Samantha
Pawan Kalyan
Birthday
Tollywood

More Telugu News